- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికైన అరవింద్ రెడ్డికి సన్మానం
by Ratna Kumari |
దిశ, వీపనగండ్ల : వీపనగండ్ల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్ కుమార్ రెడ్డి ఇటీవల విడుదలైన

X
దిశ, వీపనగండ్ల : వీపనగండ్ల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్ కుమార్ రెడ్డి ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాలలో ఎక్సైజ్ ఎస్సై గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వరలక్ష్మి నేతృత్వంలో కార్యాలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం తహసీల్దార్ వరలక్ష్మి మాట్లాడుతూ.. "అరవింద్ కుమార్ రెడ్డి మా కార్యాలయంలో ఉన్నత సేవలందించడంతో పాటు, కృషి చేసి ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం అన్నారు. ఆయన సాధన యువతకు ప్రేరణ కలిగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శివకుమార్, ఆర్ఐ కురుమూర్తి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






