అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే అనుకున్నవన్ని జరుగుతాయి : డిపో మేనేజర్ సుజాత

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో అరుణాచలం దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే మనసులోని కోరికలు నెరవేరి, అంతా మంచే

అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే అనుకున్నవన్ని జరుగుతాయి : డిపో మేనేజర్ సుజాత
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో అరుణాచలం దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే మనసులోని కోరికలు నెరవేరి, అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉందని, అందుకు భక్తుల సౌకర్యార్థం ఈనెల 31, నవంబర్ 4 న తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడుపనున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత తెలిపారు. ఈ నెల 31 న, నవంబర్ 4 న రాత్రి 7 గంటలకు మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుండి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సులు ముందుగా కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనానంతరం, మరుసటిరోజు తమిళనాడు వెల్లూరు శ్రీ మహాలక్ష్మీ దర్శించుకుని ముందు బస్సు నవంబర్ 1 వ తేదిన, రెండో బస్సు 5 వ తేది సాయంత్రాలు అరుణాచలం చేరుకుంటాయని ఆమె వివరించారు. గిరి ప్రదక్షిణ అనంతరం మొదటి బస్సు నవంబర్ 2 వ తేది, రెండో బస్సు 6 వ తేది సాయంత్రాలు తిరిగి మహబూబ్ నగర్ కు బయలుదేరుతాయని డిఎం తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యం కలిగిన సూపర్ లగ్జరీ బస్సుల చార్జీలు అన్ని టోల్, సెస్, బోర్డర్ చార్జీలు కలుపుకుని పెద్దలకు 3600, పిల్లలకు 2000 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కై మహబూబ్ నగర్ బస్ స్టేషన్ లో కాని, వెబ్ సైట్ tsrtconline.in లో కాని సర్వీస్ నెంబర్ 94443 పై బుక్ చేసుకోవచ్చని డిఎం సుజాత సూచించారు.

Next Story