పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ :  కలెక్టర్ బాదావత్ సంతోష్

by Nallavelli.Anjaneyulu |

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. హైదరాబాద్

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ :  కలెక్టర్ బాదావత్ సంతోష్
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్-2026 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో బిఎల్ఓలకు శిక్షణ అందించినట్లు తెలిపారు. 2002, 2025 ఓటర్ల జాబితాలను ఆధారంగా తీసుకుని ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఐఆర్‌ నిర్వహణపై సూపర్వైజర్లు, బిఎల్ఓలకు మరిన్ని శిక్షణలు అందిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ పి.అమరేందర్‌, నాగర్‌కర్నూల్‌ ఆర్టీవో సురేష్‌, కొల్లాపూర్‌ ఆర్డీవో బన్సీలాల్‌, అచ్చంపేట ఆర్డీవో మాధవి, కల్వకుర్తి ఆర్డీవో జనార్ధన్ రెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Next Story