- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పది పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయా..?
పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయా..? పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాస్తున్నారా? వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారా? అని జిల్లా ఎస్పీ జానకి ఆరా తీశారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయా..? పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాస్తున్నారా? వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారా? అని జిల్లా ఎస్పీ జానకి ఆరా తీశారు. శుక్రవారం పట్టణంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రలైన గాంధీరోడ్ హైస్కూల్,క్రీస్తు జ్యోతి ఉన్నత పాఠశాలలో భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకం కలగకుండా,ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలను ఆమె పరిశీలించారు. పరీక్ష హాలులో క్రమశిక్షణ పాటిస్తూ,విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు తీసుకున్నామని ఆమె తెలియజేశారు. పది పరీక్షలు అయిపోయే వరకు విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా,వారి ప్రశాంతతకు భంగం కలగకుండా మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా పోలీస్ శాఖ తోడ్పాటు అందిస్తుందని ఎస్పీ జానకి తెలిపారు.






