- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేనా..?
కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే ప్రభుత్వానికి మాత్రం పన్నులు వేరే పార్టీ వాళ్లు ఎందుకు చెల్లించాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ పార్టీ జోనల్ ఇన్ చార్జి పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే ప్రభుత్వానికి మాత్రం పన్నులు వేరే పార్టీ వాళ్లు ఎందుకు చెల్లించాలని నాగర్ కర్నూల్ బీఎస్పీ పార్టీ జోనల్ ఇన్ చార్జి పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. లింగసానిపల్లి గ్రామానికి చెందిన బోనాసి నాగమ్మ కు 30-05-2025న ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ లెటర్ ఇవ్వడంతో ఆ కుటుంబీకులు రూ.3లక్షలు అప్పు ఇల్లు నిర్మాణం చేయగా తీరా ఇప్పుడు మీరు ఫలానా పార్టీ కాబట్టి మీకు బిల్లు రాదని గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారని పాపయ్య గోడును విలపించారు. ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ లెటర్ ఇచ్చినప్పుడు లబ్ధిదారులు ఏ పార్టీ వారు అనేది తెలియదా..? అని ప్రశ్నించ్చారు. ప్రభుత్వ పథకాలు ఫలానా పార్టీ వాళ్ళకే అనే రూల్ ఎక్కడుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ వాళ్ళకే ఇచ్చినప్పుడు, ప్రభుత్వానికి పన్నులు కూడా అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే కట్టాలన్నారు. పన్నులేమో అందరూ కట్టాలి, పథకాలేమో అధికార పార్టీ వాళ్ళకేనా అనీ మండిపడ్డారు.
ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బును ప్రజాధనం అంటారు తప్ప, ప్రభుత్వం డబ్బు అనరని హితవు పలికారు. సీఎం ఆదేశాలేమో చిన్న చిన్న తప్పులు జరిగితే ప్రజల అకౌంట్స్ నుంచి డబ్బులు కట్ అయ్యే విధంగా వ్యవస్థను నిర్మాణం చేయాలని అంటారు. ప్రభుత్వాల అకౌంట్స్ కూడా ప్రజలకు లింక్ చేయాలనీ అన్నారు. అలా లింక్ చేస్తే, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలకు ఆ అకౌంట్స్ నుండి డబ్బులు పడే విధంగా వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేశారు. అట్లాగే ఓట్లు వేసి గెలిపిస్తున్న నాయకులు మీ గురించి మాట్లాడకుండా ఉంటే ఎందుకు నిలదీయడం లేదని ప్రజలకు తెలియజేశారు. ఇప్పటి వరకూ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో సాంక్షన్ లెటర్ ఇచ్చి, మొదటి విడత బిల్లులు రాని వాళ్ళందరిని కలుపుకుని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ సి. కళ్యాణ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి హర్ష ముదిరాజ్, అసెంబ్లీ కమిటీ ప్రధాన కార్యదర్శి (లింగసానిపల్లి వార్డ్ మెంబర్) బోనాసి భాస్కర్, బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.






