- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురిటి నొప్పులతో బాధపడుతున్న అప్పాపూర్ పెంట మహిళ.. మానవత్వం చాటుకున్న అటవీ శాఖ సిబ్బంది
దిశ, అచ్చంపేట : గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతం లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ పెంటకు చెందిన ఆదివాసీ మహిళ పురిటి

దిశ, అచ్చంపేట : గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతం లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ పెంటకు చెందిన ఆదివాసీ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారిని ఎఫ్బీవో కే శిల్ప వెంటనే సఫారీ వాహనాన్ని ఏర్పాటు చేసి సురక్షితంగా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆ నిండు గర్భిణి తోకల జగదీశ్వరుని సాటి మహిళగా తోడ్పాటును అందించారు. వర్షాల కారణంగా అడవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉండడం వలన 108 వాహనం వెళ్లలేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఆ గర్భిణీ కోసం అటవీశాఖ అధికారులు శిల్ప, గురువయ్యలు జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, మన్ననూరు అటవీశాఖ క్షేత్ర అధికారి వీరేష్ సూచనలతో వెంటనే ఆ గర్భిణీని అప్పాపూర్ పెంట నుండి సఫారీ వాహనం ద్వారా మన్ననూరు గ్రామానికి చేర్చారు. ఇక అక్కడి నుంచి 108 వాహనం ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సహకరించినందుకు బాధిత మహిళా కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.






