అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు తప్పక రేషన్ ఇవ్వాల్సిందే

by Nallavelli.Anjaneyulu |

అంత్యోదయ కార్డులు ఉన్న లబ్ధిదారులకు తప్పక రేషన్ బియ్యం ఇవ్వాలని.. అలా ఇవ్వని రేషన్ షాపులను పై వేటు వేస్తామని.. సామాన్యులకు బియ్యం సరఫరా చేయకపోవడం చాలా బాధాకరమని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిషన్ సభ్యులు శారద అన్నారు.

అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు తప్పక రేషన్ ఇవ్వాల్సిందే
X

దిశ, అచ్చంపేట : అంత్యోదయ కార్డులు ఉన్న లబ్ధిదారులకు తప్పక రేషన్ బియ్యం ఇవ్వాలని.. అలా ఇవ్వని రేషన్ షాపులను పై వేటు వేస్తామని.. సామాన్యులకు బియ్యం సరఫరా చేయకపోవడం చాలా బాధాకరమని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిషన్ సభ్యులు శారద అన్నారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలో 6వ నిత్యవసర సరుకుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తాలో ఉన్న బియ్యాన్ని తూకం వేయించి చూశారు. ఈ సందర్భంగా వారు అంత్యోదయ కార్డులకు రేషన్ బియ్యం అందజేస్తున్నారా..? అని ఆరా తీయగా ఇవ్వడం లేదని, ఎందుకు ఇవ్వడంలేదని కమిషన్ చైర్మన్ ప్రశ్నించగా.. అందరూ అంత్యోదయ కార్డుల ప్రకారమే రేషన్ బియ్యం ఇవ్వాలని అడుగుతున్నారని అందుకే తేవడం లేదని డీలర్ సమాధానం చెప్పడంతో వారిపై మండిపడ్డారు. వెంటనే షాపును రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అక్కడే ఉన్న మీడియా సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకాలం అంత్యోదయ కార్డుల లబ్ధిదారులు నష్టపోయారు. వారి నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. అందుకు అంత్యదయ యాక్టివ్ ప్రకారం లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వకపోతే ఆ నష్టాన్ని సంబంధిత అధికారులు, డీలర్ బాధ్యత ఉంటుందని హెచ్చరించారు.

మీ పిల్లలకు భోజనం ఇలానే పెడతారా..


అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి అందించాల్సిన పప్పు నీళ్లగా మాదిరిగా ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా చింతల్ బస్తీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం గత నెల రోజుల నుంచి మూతపడి ఉందని కమిషన్ చైర్మన్ సభ్యులకు సంబంధించిన వారు ఫిర్యాదు చేశారు. తదుపరి సివిల్ సప్లై గోదాం కి వెళ్లి పరిశీలించారు. అటు నుండి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం కొంతమంది విద్యార్థులు ఇంటి నుండి తెచ్చుకుని తినేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. స్కూల్లో బాగా వడ్డించడం లేదా ఎందుకు తెచ్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు. తదుపరి విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ భోజనాన్ని పరిశీలించి.. వండిన కూరలు ఏమిటని హెచ్ఎం అడగగా తడబడుతూ పప్పు, సాంబారు, రెండు కూరలు ఆలుగడ్డ ఏకపోయినా ఆలుగడ్డ వేశామని చెప్పడంతో చైర్మన్ తప్పుడు సమాచారం చెబుతున్నార‌ని దీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ పిల్లలకు భోజనం ఇలానే వండి పెడతారా అని.. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు ఆర్డిఓ యాదగిరి, ఏటిడిఓ ఫిరంగి, డి ఈ ఓ రమేష్, త‌హ‌శీల్దార్ సైదులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story