కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఘటించాలి : సీఐటీయూ జిల్లా అధ్య‌క్షులు ఆంజ‌నేయులు

by Ratna Kumari |

దిశ, వంగూర్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం వంగూరు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఘటించాలి : సీఐటీయూ జిల్లా అధ్య‌క్షులు ఆంజ‌నేయులు
X

దిశ, వంగూర్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం వంగూరు మండల కేంద్రంలో బి.శివరాములు అధ్యక్షతనతో జరిగిన సీఐటీయూ వంగూరు మండల రెండో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలను తీసుకొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న అంగన్వాడి, ఆశ మధ్యాహ్నం భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్, ఐకెపి, వివో ఎ, గ్రామపంచాయతీ తదితర రంగాల కార్మికులతో కనీస వేతనం 26,000 ఇవ్వకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ హమాలీ ట్రాన్స్పోర్ట్ ఆటో రంగాల కార్మికులకు ఉపాధి కల్పించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా ఉద్యోగ భద్రత తదిత సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాలస్వామి కార్మికులకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల నాయకురాలు అరుణ, లక్ష్మమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు సుమతమ్మ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్, జనార్ధన్, హమాలి సంఘం నాయకులు గెలువయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మండల నాయకులు శ్రీనయ్య, వివోల సంఘం మండల నాయకురాలు దివ్య రూపిని, సుమతమ్మ, లక్ష్మయ్య, కొండల్ పాల్గొన్నారు.

Next Story