అన్న అదృశ్యం.. త‌మ్ముడు ఫిర్యాదు

by Ratna Kumari |

దిశ‌, వ‌న‌ప‌ర్తి రూర‌ల్ : అన్న అదృశ్యం కావ‌డంతో త‌మ్ముడు ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని కందిరీయ తండాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. వనపర్తి మండల పరిధిలోని కందిరీయ తండా గ్రామపం

అన్న అదృశ్యం.. త‌మ్ముడు ఫిర్యాదు
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి రూర‌ల్ : అన్న అదృశ్యం కావ‌డంతో త‌మ్ముడు ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని కందిరీయ తండాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. వనపర్తి మండల పరిధిలోని కందిరీయ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎద్దుల గేరి కి చెందిన ఎద్దుల చెండ్రాయుడు అనే వ్య‌క్తి తన అన్న అయినా ఎద్దుల వెంకటేష్ (34) గురువారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో పనికి వెళుతున్నాను చెప్పి ఇంట్లో నుండి వెళ్లి మధ్యాహ్నం సుమారు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వెంకటేష్ కు ఫోన్ చేసి బీచ్ పల్లి దగ్గర ఉన్నానని వీడియో కాల్ కూడా చేసి వాట్సాప్ లో వీడియో పంపించినాడు. తర్వాత అతని గురించి బీచుపల్లి దగ్గరికి వెళ్లి వెతుకగా ఎక్కడ కనిపించలేదు. మా అన్న ఆచూకీ కనుకొని న్యాయం చేయగలరని ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ వెంకటేష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story