- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తా చాటేందుకు ఆంధ్ర సెటిలర్లు సన్నద్ధం
దిశ, మక్తల్ : స్థానిక ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం కృష్ణానది తీరా ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ఆంధ్ర సెటిలర్స్ సన్నద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అటు

దిశ, మక్తల్ : స్థానిక ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం కృష్ణానది తీరా ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ఆంధ్ర సెటిలర్స్ సన్నద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ ఓటు హక్కును కలిగి ఉన్న ఆంధ్ర సెటిలర్స్ కృష్ణానది తీరా ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలలో పెద్దఎత్తున భూములను కొనుగోలు చేసి ఇక్కడే స్థిరపడ్డారు. కడప గడప వారి సొంత ఊర్లకు వెళ్లి వచ్చేవారు. ఎన్నికల సమయంలో మాత్రం తప్పనిసరిగా ప్రత్యేక వాహనాల్లో అక్కడికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకొని వస్తారు. ఇక్కడ ఓటర్లుగా కొనసాగుతూ ఉన్నారు.
నియోజకవర్గంలోని మాగనూర్. కృష్ణా మండలాల్లో హిందుపూర్గ్, డెబల్గూర్, సూకుర్లింగంపల్లి, మూడుమాల్, కొల్పూర్, తంగిడి పలు ప్రాంతాల్లో దాదాపు రెండు నుంచి మూడువేల వరకు ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఆస్తుల రక్షణ కోసం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సెటిలర్స్ పట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు పలుచోట్ల ప్రభుత్వ భూములను తమ పట్టా పొలాలలో కలుపుకున్నట్లు కొంతమంది నాయకులు గుర్తించడం.. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయిల్లో ఉన్న తాము ఇబ్బందులు పడకూడదనకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయడం ఒకటే మార్గం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.






