విద్యార్థులు ఉండగానే కూలిన స్కూల్ పై కప్పు

by velandi.Saikiran |

ప్రభుత్య పాఠశాల తరగతి గది పై కప్పు కూలిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.

విద్యార్థులు ఉండగానే కూలిన స్కూల్ పై కప్పు
X

దిశ, కొల్లాపూర్: ప్రభుత్య పాఠశాల తరగతి గది పై కప్పు కూలిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి. 70 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం గోడల మధ్య రావి చెట్లు ఏపుగా పెరిగి పోయింది. ఇక‌ శుక్రవారం ఉదయం 4వ తరగతి గది బ్లాక్ బోర్డు ప్రదేశంలో పై కప్పు ఒక్కసారిగా పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి క్లాస్ టీచర్ సత్యనారాయణతో పాటు 15 మంది విద్యార్థులు తృటిలో తప్పించుకున్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ స్పందించారు. వర్ష కాలం వస్తే పాఠశాల గదులలో వర్షపు నీటితో నిండిపోతాయని, కొన్ని గదులలో పెచ్చులు ఊడిపడి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల కావడంతో పూర్తిగా శిథిలా వ్యవస్థను చేరుకుందని ఆయన తెలిపారు. విద్యాధికారులు స్పందించి పాఠశాలలు వేరే చోటికి మార్చాలని కోరారు.

Next Story