నేల వాలిన 200 ఏళ్ల చరిత్ర కలిగిన నారేప చెట్టు

by velandi.Saikiran |

జామా మజీద్ ఆవరణలోని దర్గా ప్రాంగణంలో ఉన్న అతి పురాతన నారేప చెట్టు వేర్లతో సహా ఒక్కసారిగా కూలిపోయింది.

నేల వాలిన 200 ఏళ్ల చరిత్ర కలిగిన నారేప చెట్టు
X

దిశ, లింగాల: లింగాల మండల కేంద్రంలోని జామా మజీద్ ఆవరణలోని దర్గా ప్రాంగణంలో ఉన్న అతి పురాతన నారేప చెట్టు వేర్లతో సహా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ చెట్టు దాదాపు 200 సంవత్సరాలకు పైగా పురాతనమై ఉండవచ్చని స్థానికులు తెలిపారు. చెట్టు కూలి సమీపంలోని ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో పడింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న అత్తావుల్లాకు చెందిన కారు, డోజర్ బండి ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు అత్తావుల్లా తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఘటన అనంతరం విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాదర్ భాషా, ఘటన స్థలానికి చేరుకొని అక్క‌డి పరిస్థితిని పరిశీలించారు.

Next Story