- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలరించిన మాక్ పార్లమెంట్
మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ అందరినీ ఆకట్టుకుంది.

X
దిశ, భూత్పూర్ : మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం నిర్వహించిన మాక్ పార్లమెంట్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థిని శ్రీ హర్షిని రాష్ట్రపతిగా, సైద ఖాద్రి స్పీకర్ గా, హబీబున్నీసా ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సింధు వ్యవహరించారు. కేంద్ర కేబినెట్ మంత్రులుగా హర్షిత, కల్పన, అక్షర, మహేష్, తదితరులు వ్యవహరించారు. సమావేశాలకు ముందు రాష్ట్రపతి ప్రసంగం, అభివృద్ధిపై మంత్రుల ప్రసంగాలు.. ఆయా నియోజకవర్గాల సభ్యులు సమస్యల ప్రస్తావనలు.. విమర్శలు.. గొడవలు.. తదితర అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Next Story






