- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్ కి సమీపంలో ఉన్న గోల్డ్ షాపు చోరీకి యత్నం..!
దిశ, మక్తల్ : పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఉన్న విష్ణు జ్యువెలర్స్ షాప్ షట్టర్ లాకును కట్ చేసి దోచుకోవడానికి గుర్తు తెలియని

దిశ, మక్తల్ : పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఉన్న విష్ణు జ్యువెలర్స్ షాప్ షట్టర్ లాకును కట్ చేసి దోచుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించగా.. షట్టర్ కు సెంటర్ లాక్ ఉండడంతో విఫలం చెందారు. దీంతో షాపు వెనుక వైపు గోడకు రంధ్రం చేయడానికి ప్రయత్నించిన వీలుకాకపోవడంతో చోరి మానుకొని తిరిగి వెనక్కి వెళ్లారు. ఈ సంఘటన మక్తల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. గోల్డ్ షాప్ కు సెంటర్ లాక్, గోడ రంద్రం పడకపోవడంతో పెద్ద గండమే తప్పింది. గురువారం రాత్రి యజమాని ముఖేష్ దుకాణం మూసేసి ఉన్న ఉదయం దుకాణం తెరిచేందుకు నౌకర్ షట్టర్ వైపు చూడగా లాక్ కట్ చేసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేస్తున్నారు. మక్తల్ పట్టణంలోనే రెండు వారాల్లోనే నాలుగు దొంగతనాలు జరగడం పోలీసులకు సవాల్ మారింది. దొంగతనాలపై పట్టణంలోని ప్రజలు పోలీసుల పని తీరు అని ఎండగడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టి పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ వరస దొంగతనాలు ఎలా జరుగుతాయని ప్రజలు పేర్కొంటున్నారు.






