- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి అంటే దేశ స్వాతంత్రం పై దాడి చేసినట్టే : మందకృష్ణ మాదిగ
దిశ, జడ్చర్ల : దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన మైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడి జరగడం దేశ స్వాతంత్య్రం మీదే దాడి జరగడమన్నారు మంద కృష్ణమాదిగ. దీనిపై పోలీస్ యంత్రాంగం ,

దిశ, జడ్చర్ల : దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన మైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడి జరగడం దేశ స్వాతంత్య్రం మీదే దాడి జరగడమన్నారు మంద కృష్ణమాదిగ. దీనిపై పోలీస్ యంత్రాంగం, మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్య అని అందుకు నిరసనగా ఈనెల 17న చేపట్టబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ తోపాటు అనుబంధ సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈనెల 17వ తేదీన చలో ఢిల్లీ సమాయత్తానికి సిద్ధమైందని తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి పై దాడి జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు పోలీస్ యంత్రాంగం, మానవ హక్కుల కమిషన్ కానీ దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ దళితుడు కాబట్టే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దేశంలో, రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నా వెంటనే స్పందించిన మానవ హక్కుల కమిషన్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడి పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. దేశానికె అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న జస్టిస్ గవాయికి రక్షణ లేనప్పుడు దేశంలో ఉన్న సామాన్య దళితులకు ఎలా రక్షణ ఉంటుందన్నారు. అందుకు నిరసనగా ఈనెల 17వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని అందుకు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.






