రేపు ప్ర‌ధాని మోడీ శ్రీశైలం రాక‌.. ర‌హ‌దారి పై ఆంక్ష‌లు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం శ్రీశైలం పుణ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆంక్షలు అమల్లో ఉంటాయని,

రేపు ప్ర‌ధాని మోడీ శ్రీశైలం రాక‌.. ర‌హ‌దారి పై ఆంక్ష‌లు..!
X

దిశ, అచ్చంపేట : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం శ్రీశైలం పుణ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శించ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆంక్షలు అమల్లో ఉంటాయని, శ్రీశైలం వైపు వెళ్లే రహదారులపై తాత్కాలిక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. గత మూడు రోజుల నుంచి శ్రీశైలం పరివాహక ప్రాంతం అంతా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత చర్యలను మరింత పటిష్టం చేశారు. ఈ క్రమంలో శ్రీశైల దైవదర్శనానికి వెళ్లే యాత్రికులు, భక్తులు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ట్రాఫిక్ ను క్రమ యుద్ధకరిస్తూ దారి మళ్లింపు చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర నలుమూలల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు, పర్యాటకులను నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్, ఓటవర్లపల్లి, బ్రహ్మగిరి గ్రామాలలో వాహనాలను అదుపు చేసే అవకాశం ఉంది. కావున శ్రీశైలం వెళ్లే భక్తులు, యాత్రికులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే శుక్రవారం ఉదయం వెళ్లకుండా మధ్యాహ్నం తర్వాత తమ ప్రయాణాలను మార్చుకుని వెళ్తే కాలయాపన చేయకుండా ఉంటుంది. కావున యాత్రికులు ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ప్ర‌యాణాలు సాఫీగా సాగుతాయని క‌లెక్ట‌ర్ జి.రాజ‌కుమారి, పోలీస్ సూప‌రింటెండెంట్ సునీల్ షెరాన్ సంయుక్తంగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌లో భాగంగా అక్టోబ‌ర్ 16న ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు శ్రీశైలం వైపు వాహ‌నాల రాక‌పోక‌ల‌ను తాత్కాలికంగా దారి మ‌ళ్లించ‌నున్న‌ట్టు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు ప్రయాణించే భక్తులు, అలాగే దోర్నాల మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు తమ పర్యటన ప్రణాళికలను తగిన విధంగా సవరించుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి పర్యటన అనంతరం సాధారణ వాహన రాకపోకలు పునరుద్ధరించబడతాయని తెలిపారు. వాహ‌నదారులు ఇందుకు స‌హ‌క‌రించాల‌ని క‌లెక్ట‌ర్, ఎస్పీ కోరారు.

Next Story