- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగ విరుద్ధం
వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడం రాజ్యాంగ విరుద్ధం అని, ఈ చట్ట సవరణ మైనార్టీ ప్రజలను ఆందోళనకు గురి చేసే అవకాశం ఉందని స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్ ఆక్షేపించారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడం రాజ్యాంగ విరుద్ధం అని, ఈ చట్ట సవరణ మైనార్టీ ప్రజలను ఆందోళనకు గురి చేసే అవకాశం ఉందని స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్ ఆక్షేపించారు. సోమవారం వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ముస్లీం సంఘాలు నల్ల జెండాలతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మైనార్టీల హక్కులకు ముప్పుగా ఏర్పడే ఈ బిల్లుకు ప్రతిపాదిత సవరణల ఆలోచనలు మానుకోవాలని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను తిరస్కరించే, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే, వక్ఫ్ లక్ష్యాలకు విరుద్ధమైన అనేక వివక్షత గల నిబంధనలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను దేశ ప్రజలు తిప్పి కొట్టారో, అదే విధంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళనలు చేపడతామని, వెంటనే సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహ్మమద్ అవేజ్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఫయాజ్, అజ్మత్ అలి, జహీర్, అక్బర్, ఫహిం, అబ్ధుల్ హక్,పీర్ మహ్మమద్ సాదీక్, అలీం, బాసిద్, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Waqf






