అమరచింత ఓటర్ల తీర్పు సంచలనం

by Ratna Kumari |   (  Updated:2026-02-13 10:44:19  IST  )

ప్రతి మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలోని అమరచింత పట్టణ ఓటర్ల తీర్పు రాష్ట్రంలో ఎవరు ఊహించని విదంగా ఉండడం విశేషం.

అమరచింత ఓటర్ల తీర్పు సంచలనం
X

దిశ, అమరచింత: ప్రతి మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలోని అమరచింత పట్టణ ఓటర్ల తీర్పు రాష్ట్రంలో ఎవరు ఊహించని విదంగా ఉండడం విశేషం.ఇవాళ వెలువ‌డిన ఫలితాల్లో కూడా ఓటర్ల తీర్పు అనూహ్యంగా మారింది. ఈ మున్సిపాలిటీ లో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. పది వార్డుల్లో 1వ వార్డు నుంచి 3వ వార్డు వరకు 1,2,3 వార్డుల్లో ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 4వ వార్డు నుంచి 7వ వార్డు వరకు 4,5,6,7 వార్డుల్లో కాంగ్రెస్- సీపీఎం కూటమికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఒక సీపీఎం అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టారు. ఇక 8వ వార్డు నుంచి 10వ వార్డు వరకు 8, 9, 10వార్డుల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులను గెలిపించి అమరచింత ప్రత్యేకతను చాటుకున్నారు. ఓటర్లు వరుస క్రమంలో ఇలాంటి ఫలితాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీలో ఉన్న అన్ని పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐలతో పాటు ఒక ఇండిపెండెంట్ కు కూడా అవకాశం ఇచ్చి వార్తల్లో నిల‌వ‌డం విశేషం.

Next Story