- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేతెపల్లిలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం
దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని కేతేపల్లి ఉన్నత పాఠశాలలో ఇవాళ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. 1978-79 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు

దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని కేతేపల్లి ఉన్నత పాఠశాలలో ఇవాళ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. 1978-79 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. దాదాపు 46 సంవత్సరాల తరువాత మొదటిసారి కలుసుకోవడంతో పాటు చాలా సరదాగా గడిపారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ సమెళనానికి అధ్యక్షత వహించిన కేతేపల్లి గ్రామానికి చెందిన బాలిశ్వర్ రెడ్డి తన సొంత ఖర్చులతో పాఠశాలకు తనవంతుగా పాఠశాలకు ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కుట్టు మిషన్లు, వాటర్ ప్లాంట్ రిపెయిర్ వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తన స్వగృహంలో తోటి స్నేహితులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాలిశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు గోపాల్, వరలక్ష్మీ, విజయమ్మ, కృష్ణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, లక్ష్మణాచారి, వెంకటస్వామి, ఎం. రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.






