- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్ల వారీగా మద్యం షాపులు కేటాయింపు
మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి 90 మద్యం షాపులను ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం, గౌడ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.

రిజర్వేషన్ల వారీగా మద్యం షాపులు కేటాయింపు
-జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి 90 మద్యం షాపులను ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం, గౌడ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్ లో లాటరీ ద్వారా గౌడ్ కులస్తులకు 14, ఎస్సీలకు 10, ఎస్టీలకు 3 మద్యం షాపులను రిజర్వు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇట్టి మద్యం దుకాణాల కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు ఉంటుందని,ఇందుకు సంబంధించి గెజిట్ ను శుక్రవారం విడుదల చేసి, దరఖాస్తులను ఆహ్వానిస్తామని ప్రోహబీషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సునీత, జనార్ధన్, ఇందిర, తదితర ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన కలెక్టర్...
జిల్లా కేంద్రం స్టేడియం గ్రౌండ్ లోని ఇండోర్ స్టేడియం ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం సందర్శించారు.మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ అకాడమీ, స్విమ్మింగ్ పూల్ లను సందర్శించి అక్కడ నిర్వహించే క్రీడంశాల గురించి తెలుసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తూ, వాలీబాల్ అకాడమీ విద్యార్థులతో మాట్లాడి, భోజనం, వసతి సౌకర్యాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
శిశు గృహ పిల్లలకు తల్లిలా ప్రేమను పంచాలి
శిశు గృహంలోని పిల్లలకు తల్లిలా ప్రేమను పంచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. జిల్లా కేంద్రం మెట్టుగడ్డ లోని శిశు గృహను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వయసు వారిగా పిల్లలను వేరు చేసి, వారి గ్రోత్ పై మానిటరింగ్ చేయాలని, బరువు తక్కువ ఉన్న చిన్నారులకు స్పెషల్ డైట్ ఇవ్వాలన్నారు.ఇంటి వాతావరణంలో పిల్లలను పెంచాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కు లో పిల్లలను ఆడించాలని, పిల్లలకు అవసరమైన సౌకర్యాల కోసం నిధులు సమకూరుస్తానని కలెక్టర్ అన్నారు. అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో నిర్మిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ భవన్ నిర్మాణ పనులను, మరమ్మతులు చేసిన మీటింగ్ హాల్ పనులు పరిశీలించారు. కలెక్టర్ వెంట సిడబ్ల్యూవో జరీనా బేగం, సిడిపీవో శైలశ్రీ,డిసిపీవో నర్మద, చైల్డ్ ప్రోటెక్షన్ ఆఫీసర్ రాములు, సిబ్బంది ఉన్నారు.






