- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' లో ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్త
ఈనెల 06 నుంచి ప్రారంభం కానున్న 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో వివిధ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో గ్రామ స్థాయి మొదలు జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తూ వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్త ఆదేశించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈనెల 06 నుంచి ప్రారంభం కానున్న 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో వివిధ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో గ్రామ స్థాయి మొదలు జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తూ వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్త ఆదేశించారు. శుక్రవారం నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించే 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమ నిర్వహణపై గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అమలుచేసే కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో నిబద్దతతో, బాధ్యతగా నిర్దేశించిన తేదీల ప్రకారం రోజువారీ కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలన్నారు.
ఈ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, ఫైల్స్ క్లియరెన్స్, ఆరోగ్యం, విద్య సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణం, డ్రగ్స్ నివారణ, రహదారి భద్రత లాంటి తదితర అంశాలపై షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అమలు చేసిన కార్యక్రమాలు, చేపట్టనున్న కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆరోగ్య కార్యక్రమాలు, ప్రత్యేకించి హెచ్.పి.వి వ్యాక్సినేషన్, అలాగే సోలార్ విద్యుత్, జిల్లాలో అక్షరాస్యత పెంచే కార్యక్రమాలు, పిల్లలకు గుణాత్మక విద్య అందించడం, డ్రగ్స్ నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, జాబ్ మేళా, నర్సరీల పంపకం లాంటిని చేపట్టాలని ఆదేశించారు. లబ్ధీదారులకు చేరిన లబ్ధీల వివరాలను గ్రామ సభల్లో వివరించడం,యువజన వారోత్సవంలో భాగంగా నిర్వహించే మండల స్థాయి కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారులు భాగస్వామ్యం కావాలని, అలాగే 'అరైవ్ అండ్ అలైవ్' కార్యక్రమాల వంటివి నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శానిటేషన్ కార్యక్రమాలతో పాటు, ఫైల్ క్లియరెన్స్ కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా శాఖల్లో పెండింగ్ ఫైల్స్ లిస్ట్ రూపొందించి క్లియర్ చేయాలన్నారు.అలాగే ఆయా శాఖల వారీగా సాధించిన అభివృద్ధిపై ప్రజలందరికీ తెలపాలని,అన్ని కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలని పునరుద్ఘాటించారు. జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా, మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా కార్యక్రమాలు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని షెడ్యూల్డ్ ప్రకారం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా నిర్వహించాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులకు పవర్ ప్రజేంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, ఆర్డీవో నవీన్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






