తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి కలెక్ట‌ర్ సంతోష్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, గ‌ద్వాల క‌లెక్ట‌రేట్ : తెలంగాణా రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ ని

తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి కలెక్ట‌ర్ సంతోష్
X

దిశ‌, గ‌ద్వాల క‌లెక్ట‌రేట్ : తెలంగాణా రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ ని రూపొందిస్తోందని.. ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతీ పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10న‌ ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్ఆర్ఐ లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వే లో రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తూ నేడు సర్క్యులర్ జారీ చేసింది. ఈనెల 25వ తేదీ వరకు జరిగే విజన్-2047 సర్వేలో ఉద్యోగులంద‌రూ పాల్గొనడం తో పాటు ఈ సర్వే లింక్ ను, QR) క్యూఆర్ కోడ్ ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆ సర్క్యులర్ లో ఆదేశించారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు http //www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా పాల్గొనాలని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Next Story