- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
by velandi.Saikiran |
కొల్లాపూర్ లో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ కు శనివారం

X
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ లో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ కు శనివారం టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణతో పాటు నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాలని, అంతవరకు ఖాళీగా ఉన్న ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల భవనాలను కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్రెస్ క్లబ్ అంశంపై చర్చించి పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్ర కొల్లాపూర్ నియోజక వర్గం అధ్యక్షులు జలకం మద్దిలేటి కార్యదర్శి కురుమయ్య జిల్లా ప్రచార కార్యదర్శి బాదం పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






