- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పరాభవ నామ' సంవత్సరంలో అన్ని శుభ సంకల్పాలే జరగాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పరాభవ నామ' సంవత్సరంలో ప్రజలందరూ సుఖ, శాంతులతో అన్ని శుభ సంకల్పాలే జరగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరుకున్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : 'పరాభవ నామ' సంవత్సరంలో ప్రజలందరూ సుఖ, శాంతులతో అన్ని శుభ సంకల్పాలే జరగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరుకున్నారు. గురువారం శిల్పారామంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణం వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రజలందరూ ఆయురారోగ్యాలు సిద్దించాలని, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని, విద్యార్థులు తమ చదువులో ఉత్తమ ఫలితాలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మేయర్ మమత మాట్లాడుతూ ఉగాది సందర్భంగా మన ప్రతి అడుగులో విజయం సొంతం కావాలని కోరుతూ, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. డిఫ్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సంవత్సరం పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ అభివృద్ధి పథంలో పయనించాలని పేర్కొన్నారు. అంతకుముందు అర్చకులు శ్రవణ్ కుమార్ పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి కార్పోరేటర్లు పాల్గొన్నారు.






