అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫోన్ హ్యాక్

by Ratna Kumari |

దిశ‌, ఉండ‌వెల్లి : సైబ‌ర్ నేర‌గాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్ర‌భుత్వ అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు, పేద, ధ‌నిక అని తేడా లేకుండా ఎవ్వ‌రి ఫోన్ ను అయినా హ్యాక్ చేసి డ‌బ్బుల‌ను దండుకుంటున్నారు.

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫోన్ హ్యాక్
X

దిశ‌, ఉండ‌వెల్లి : సైబ‌ర్ నేర‌గాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్ర‌భుత్వ అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు, పేద, ధ‌నిక అని తేడా లేకుండా ఎవ్వ‌రి ఫోన్ ను అయినా హ్యాక్ చేసి డ‌బ్బుల‌ను దండుకుంటున్నారు. ముఖ్యంగా మోసం చేసి డ‌బ్బులు సంపాదించాల‌నే నెపంతో ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లను హ్యాక్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సంచలనం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫోన్ నంబర్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సిబ్బంది సోషల్ మీడియాలో మెసేజ్ పంపడం చర్చనీయాంశంగా మారింది. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం ఏమిటని ప్రజలు చర్చింకుంటున్నారు. ఎమ్మెల్యే ఫోన్ నంబర్ నుంచి వచ్చే ఫోన్ లు, కానీ మెసేజ్ లకు కానీ, ఏపీకే పైల్స్ మెసేజ్ లకు ఎవరు స్పదించవద్దుని ఎమ్మెల్సీ క్యాంప్ ఆపీస్ సిబ్బంది పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయుడు ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చి డబ్బులు పంపమని అడిగిన వెంటనే ఆ ఫోన్ లకు స్పందించకుండా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఫిర్యాదులు అందించవచ్చని పేర్కొన్నారు.

Next Story