- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యం.. చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి నియోజకవర్గంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి, ప్రముఖ సీనియర్ వైద్యుడు డా. దామోదర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం సుంకిరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి చూపును అందించడం ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. జూలై 5 నుంచి 13 వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఉచిత కంటి వైద్య సేవలు కొనసాగుతాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మొదటి రోజే 800 మందికి పైగా హాజరవగా, 600 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 35 మందిని కంటి శుక్లాల సర్జరీల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే, 300 పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుర్తి సీనియర్ జడ్జి శ్రీదేవి శిబిరాన్ని సందర్శించి, అందిస్తున్న సేవలను పరిశీలించారు. అద్దాల పంపిణీ, కంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన అంశాలపై వైద్య బృందంతో చర్చించి వారిని అభినందించారు.
జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ.. “సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయం. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో ఐక్యత ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవలను గమనించాను. ప్రజల పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల ఇలాగే సేవా భావాన్ని కలిగి ఉండాలి. పేదలకు ఉచిత కంటి సర్జరీలు, అద్దాల పంపిణీ వంటి ఖర్చుతో కూడుకున్న సేవలు అందిస్తుండడం గొప్ప విషయం,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






