- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి : డీఈవో ప్రవీణ్ కుమార్
ఎయిడ్స్ అనే వ్యాధి ప్రాణాంతకమైనదని,ఈ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఎయిడ్స్ అనే వ్యాధి ప్రాణాంతకమైనదని,ఈ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డైట్ కాలేజీలో జిల్లా విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఎయిడ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డిఈవో మాట్లాడారు. రోజు రోజుకు మహమ్మారిలా విస్తరిస్తున్న ఎయిడ్స్ పై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి, వ్యాధి సోకినవారితో జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని అన్నారు. ఎయిడ్స్ వ్యాధి సోకే విధానాన్ని డిఈవో వివరించారు. జిల్లాలో ఎంపిక చేయబడ్డ 84 పాఠశాలల విద్యార్థులకు ఎయిడ్స్ పై పోస్టర్ మేళా ప్రజెంటేషన్ కాంపిటీషన్ నిర్వహించినట్లు, ఈ కాంపిటీషన్ లో మొదటి బహుమతి హన్వాడ మండల కేజీబీవీ విద్యార్థిని కల్పన,రెండవ బహుమతి ఎదిర గ్రామ జడ్పీహెచ్ఎస్ విద్యార్ధిని నందిని, మూడవ బహుమతి మహ్మదాబాద్ బాలుర జడ్పీహెచ్ఎస్ బద్రీనాథ్ లు గెల్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ జీ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజు,కళాశాల ప్రిన్సిపాల్ మినాజుద్ధీన్,ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సిఎంఓ సుధాకర్ రెడ్డి, డిఎస్ఓ షంషీర్,తదితర విద్యార్థులు పాల్గొన్నారు.






