- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ స్మశాన వాటికలో డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలి
by velandi.Saikiran |
డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని కోరుతూ కార్యదర్శి కృష్ణయ్యకు అడ్వకేట్ నాగేశ్వర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు.

X
దిశ, రాజోలి: మండల కేంద్రంలోని తుమ్మలపల్లి హిందూ స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్యకు అడ్వకేట్ నాగేశ్వర్ రెడ్డి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ స్మశాన వాటికలో గ్రామానికి చెందిన ఘన వ్యర్థాలు, గృహ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర చెత్తను డంపింగ్ చేయడం వల్ల ఆ ప్రాంత పవిత్రత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో స్మశాన వాటికలో చెత్త వేయకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు, చట్టబద్ధ సంస్థలను ఆశ్రయించి ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ నాగేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
Next Story






