ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'దోస్త్' ద్వారా అడ్మిషన్లు : ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్

by Ratna Kumari |

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సాంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధినిచ్చే కోర్సులకు 'దోస్త్' ద్వారా అడ్మిషన్లు ప్రారంభమైనవని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వారా అడ్మిషన్లు :  ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సాంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధినిచ్చే కోర్సులకు 'దోస్త్' ద్వారా అడ్మిషన్లు ప్రారంభమైనవని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో దిశ‌తో మాట్లాడారు. ట్రెడిషనల్ డిగ్రీ కోర్సులైన, బీఏ (హిస్టరీ, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్) తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) ఇంగ్లీష్ మీడియం, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ (బోటనీ,జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ న్యూట్రీషియన్) ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్) ఇంగ్లీష్ మీడియంలో అడ్మీషన్లు ప్రారంభ‌మైన‌ట్టు తెలిపారు.


అదేవిధంగా ఉపాధినిచ్చే ఎంబెడెడ్ కోర్సులైన బి.కాం(ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బీఎస్సీ(హెల్త్ కేర్ సైన్స్) వంటి నైపుణ్యం కోర్సుల్లో కూడా ఛాయిస్ బెస్ట్ క్రెడిట్ సిస్టం పద్ధతిలో గల 32 కోర్సులను అభ్యసించేందుకు 'దోస్త్' ద్వారా తొలి విడత ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు, రెండో విడత మే 15 నుంచి 25 వరకు, మూడవ విడత 31 నుంచి జూన్ 15 వరకు ప్రవేశాలను ఇలా మూడు విడతలుగా చేపట్టిన్నట్లు ఆయన వివరించారు. దోస్త్ హెల్ప్ లైన్ నెంబర్ 9440842201ద్వారా విద్యార్థినీలు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ చేసుకునే సదుపాయం కలదని, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story