- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమరం భీమ్ ను స్మరించుకోవాలి : హిందూవాహిని జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్
దిశ, వనపర్తి టౌన్ : ఆదివాసి ల హక్కుల పోరాట వీరుడు కొమరం భీమ్ ను స్మరించుకోవాలని హిందూవాహిని వనపర్తి జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్ అన్నారు.ఆదివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో

దిశ, వనపర్తి టౌన్ : ఆదివాసి ల హక్కుల పోరాట వీరుడు కొమరం భీమ్ ను స్మరించుకోవాలని హిందూవాహిని వనపర్తి జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్ అన్నారు.ఆదివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొమరం భీమ్ వారోత్సవాలలలో భాగంగా హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో యువకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్బంగా హిందూవాహిని జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను నెలరాస్తూ నిజాం నవాబులు చేసిన దోపిడీ, దౌర్జన్యాలనువ్యతిరేకిస్తూ జల్-జంగిల్-జమీన్ నినాదం తో వీరోచితంగా పోరాటం చేసి పోరాట యోధుడు కొమరం భీమ్ అని కొనియాడారు. తెలంగాణ రాష్టం కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు కొమరం భీమ్. కొమురం భీమ్ లాంటి ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తి చరిత్రలో నిలిచిపోతారన్నారు. యువత కొమరం భీమ్ త్యాగాన్ని స్మరించుకుంటూ.. భవిష్యత్తు లో ఆచరణలో పెట్టాలాన్నారు. టీవివీపీ సూపర్డెంట్ చైతన్య గౌడ్, హిందూ వాహిని పాలమూరు విభాగ్ కన్వినర్ అభిలాష్ హౌదేకార్ పాల్గొన్నారు. రక్తదానం చేసిన కార్యకర్తలను అభినందించారు. కార్యక్రమం లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మీనాక్షి, పట్టణ కన్వీనర్ నంద, నీలేష్, మాణి, మల్లికార్జున్ రమేష్ హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.






