- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు
జోగుళాంబ గద్వాల్ జిల్లా 10వ బెటాలియన్‌లో అదనపు డీజీపీ (బెటాలియన్స్) సంజయ్ కుమార్ జైన్ పర్యటించి, పలు నూతన సౌకర్యాలను ప్రారంభించారు.

దిశ, గద్వాల క్రైమ్ : జోగుళాంబ గద్వాల్ జిల్లా 10వ బెటాలియన్‌లో అదనపు డీజీపీ (బెటాలియన్స్) సంజయ్ కుమార్ జైన్ పర్యటించి, పలు నూతన సౌకర్యాలను ప్రారంభించారు. ఆయనకు బెటాలియన్ ఇన్‌చార్జ్ కమాండెంట్ ఎం. జయరాజు, ఎస్పీ టి. శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అదనపు డీజీపీ నూతనంగా నిర్మించిన సాయిధ కన్వెన్షన్ హాల్, సాయుధ చైతన్య స్కూల్‌లో నూతన షెడ్, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ ఆవరణలో నిర్మించనున్న 30 షాపింగ్ కాంప్లెక్స్‌లకు భూమి పూజ నిర్వహించి, మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల గొల్లపల్లి చెరువులో మృతదేహాలను వెలికితీసిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాన్ని, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు, అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్ రెడ్డి, పాణిలకు సేవా పతకాలను అందజేశారు. సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.






