- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదానీ కంపెనీ కుంభకోణంపై విచారణ జరిపించాలి.. ఎస్బీఐ బ్యాంకు ఎదుట ధర్నా
దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ బ్యాంకులను, ప్రజలను, తీవ్రంగా మోసం చేసిన అదానీ కంపెనీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల్ నరసింహ డిమాండ్ చేశారు.

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ బ్యాంకులను, ప్రజలను, తీవ్రంగా మోసం చేసిన అదానీ కంపెనీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల్ నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్బీఐ బ్యాంకు ముందు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014 నాటికి 5 వేల కోట్ల వ్యాపారంతో ప్రపంచ ధనవంతుల్లో 609 వ, స్థానంలో ఉన్న అదానీ 2022 సంవత్సరానికి ప్రపంచ ధనవంతుల్లో రెండు, మూడవ స్థానాలకు చేరుకున్నాడని, 8 మిలియన్ డాలర్ల నుంచి 140 మిలియన్ డాలర్లకు తన సంపదను ఏవిధంగా పెంచుకున్నడో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉందన్నారు.
దేశంలో లక్షలాది మంది షేర్ హోల్డర్లకు ప్రభుత్వ రంగ సంస్థలకు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. తన మిత్రుని కుంభకోణం చూసి నోరు మూగ పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకటయ్య, నరసింహ, బొల్లెద్దుల శ్రీనివాసులు, శివ శంకర్, లక్ష్మీపతి, రామస్వామి, సురేష్, నిరంజన్, మదిలేటి తదితరులు పాల్గొన్నారు.






