ఎరువుల పంపిణి లో అలసత్వం వహిస్తే చర్యలు : క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-30 09:47:41  IST  )

కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లిలోని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో యూరియా లభ్యత, సరఫరాను మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పర్యవేక్షించారు.

ఎరువుల పంపిణి లో అలసత్వం వహిస్తే చర్యలు :  క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్
X

దిశ, పెద్ద కొత్త పల్లి : కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లిలోని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో యూరియా లభ్యత, సరఫరాను మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పర్యవేక్షించారు. యూరియా కొరత లేకుండా రైతులందరికీ అందేలా చూడాలని, అవసరమైతే ఉదయం 6 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభించాలని సింగిల్ విండో అధికారులను ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ రైతుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సరఫరాలో జాప్యం చేయకుండా చూడాలన్నారు. ఎక్కడ యూరియా సమస్య తలెత్తకుండా, ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా నిల్వలను నమోదు చేయాలని, రైతులకు అవసరమైన యూరియా సరఫరాను అందించేందుకు అధికారులు అధికారులు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.


పెద్దకొత్తపల్లి వ్యవసాయ కేంద్రంలో యూరియాను ఒకే దగ్గర డంపు చేయడంపై సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం చేశారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకొని మండలాల్లో గ్రామాల వారీగా అవసరానికి అనుగుణంగా కేటాయింపు చేయాలని ఆయన సూచించారు. అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి, వారి ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి, ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్ యూనిట్‌పై కేసులు నమోదు చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారులను కలెక్టర్ భాదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పెద్దకొత్తపల్లి తాహసిల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story