కొనుగోలు కేంద్రాల్లో రైతుల‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

by Ratna Kumari |

దిశ, పెద్దమందడి : వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అధికారులను, కొనుగోలు

కొనుగోలు కేంద్రాల్లో రైతుల‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
X

దిశ, పెద్దమందడి : వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అధికారులను, కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. శనివారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైతుల ధాన్యాన్ని లారీల లోకి ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఏ సమస్యలున్నా కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించి ధాన్యాన్ని తీసుకోవాలని మిల్లర్లతో రైతులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. మిల్లర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులకుసూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జ‌డ్పీటీసీ సభ్యులు రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ సిద్దయ్య, త‌హ‌శీల్దార్, ఎంపీడీవో, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story