అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయానికి చర్యలు : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

by Ratna Kumari |

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు.

అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయానికి చర్యలు : కలెక్టర్ ఖుష్బూ గుప్తా
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జానకి, జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 2019 నుంచి 2026 వరకు 380 కేసుల్లోని 224 కేసుల్లో 38,33,7,500 కోట్ల రూ లు బాధితులకు పరిహారం అందించినట్లు, మిగతా 156 కేసులు పెండింగ్లో ఉన్నట్లు,వాటి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో లక్ష్మినగర్ సర్వే నంబర్ 247, 250 ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన 5 ఎకరాల 3 గుంటల భూమిలో ఆక్రమణలు చేస్తూ భవనాలు నిర్మిస్తున్నారని, వాటిని తొలగించాలని కోరారు. గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన మేరకు కలెక్టర్, ఆర్డీఓ లు సందర్శించినట్లు, తర్వాత సర్వే చేసి ఖాళీ స్థలంలో హద్దులు నిర్ణయించినట్లు ఆర్డీఓ అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

కలెక్టర్ స్పందిస్తూ.. కోర్టు కేసులు ఉంటే కేసు పురోగతి, స్థలం పరిశీలించి రిపోర్ట్ చేయాలని ఆర్డీఓ ను ఆదేశించారు. గ్రామాల్లో చెరువుల్లో మత్స్య సొసైటీ లు ఏర్పాటు చేసేప్పుడు 5 శాతం ఎస్సీ, ఎస్టీ లకు సభ్యత్వం కల్పించాలని, మత్స్య అధికారులు కల్పించటం లేదని ఫిర్యాదు చేయగా, కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల లో సత్వరం స్పందించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నవీన్, షెడ్యూల్డ్ కులాల అబివృద్ధి అధికారిణి సునీత, పరిశ్రమల శాఖ జిఎం యాదయ్య,‌ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఛత్రునాయక్, బీసి అభివృద్ధి అధికారిణి ఇందిర, ఎల్డీఎం చంద్ర శేఖర్, విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు కె.లక్ష్మణ్, రవీంద్ర బాబు, చంద్రశేఖర్, బాలయ్య పాల్గొన్నారు.

Next Story