ప‌త్తి విత్త‌నాలు వేసిన పంట‌ను ట్రాక్ట‌ర్ తో చెడ‌గొట్టి దున్నిన వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని పోలీసుల‌కు ఫిర్యాదు

by Nallavelli.Anjaneyulu |

తమ పంట పొలంలోకి అక్రమంగా ప్రవేశించి తన పై, తన కుటుంబం పైన దాడికి పాల్పడిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ నాయక్ ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ప‌త్తి విత్త‌నాలు వేసిన పంట‌ను ట్రాక్ట‌ర్ తో చెడ‌గొట్టి దున్నిన వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని పోలీసుల‌కు ఫిర్యాదు
X

దిశ, బిజినేపల్లి : తమ పంట పొలంలోకి అక్రమంగా ప్రవేశించి తన పై, తన కుటుంబం పైన దాడికి పాల్పడిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ నాయక్ ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని కల్వకుంట తండా గ్రామం, వట్టెం గ్రామపంచాయతీ పరిధిలో గల భూమి సర్వే నెంబర్ 123 లో గల 39 గుంటల భూమి పాత్యావత్ లక్ష్మణ్ నాయక్, జాత్రులు తమ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నదని, అట్టి భూమిలో గత రెండు సంవత్సరాలుగా వారే మోక మీద ఉంటూ పంటను సాగు చేశారని, ఇదే క్రమంలో శనివారం ఉదయం తమ పొలంలో పత్తి విత్తనాలను నాటుతున్న క్రమంలో తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన పాత్యావత్ రాజు, పాత్యావత్ రవి, పాత్యావత్ చత్రు అనే ముగ్గురు వ్యక్తులు అకారణంగా మా పంట విత్తనాలను ధ్వంసం చేసి మాపై దాడి చేసారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజు రైస్ మిల్లు నిర్మాణం చేస్తున్నాడని రైస్ మిల్లుకు అడ్డుగా తన పొలం వస్తుందని ఎలాగైనా తన పొలాన్ని లాక్కోవాలని దురుద్దేశంతో మాపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని బాధితుడు వాపోయాడు. గ్రామ పెద్దల సమక్షంలో మాకు భూమిని కొలిచి హద్దులు ఏర్పాటు చేసి ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకుంటున్నామని, హద్దురాళ్ల‌ను సైతం దౌర్జన్యంగా ట్రాక్టర్ తో చెడగొట్టి దున్ని, మాపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

Next Story