బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

by velandi.Saikiran |

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది.

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, రాజోలి: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 2023 జనవరి 30న నిందితుడు కమ్మరి పెద్ద చిన్నయ్య అలియాస్ చిన్నయ్య మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ త‌రుణంలో బాధితురాలి తండ్రి రాజోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులు క్రైమ్ నెం.11/2023గా కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టిన అప్పటి సీఐ శివశంకర్, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడంతో పాటు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

విచారణ సమయంలో జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మొగిలయ్య పర్యవేక్షణలో శాంతినగర్ సీఐ శంకర్, రాజోలి ఎస్సై గోకారి, భరోసా కేంద్రం బృందం సాక్షులను సమర్థవంతంగా కోర్టులో ప్రవేశపెట్టి కేసు బలపరిచారు. విచారణ అనంతరం గద్వాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-కమ్-పోక్సో కోర్టు జడ్జి వి. శ్రీనివాస్.. నిందితుడిని దోషిగా నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఐఓలు శ్రీనివాసులు, శివశంకర్, ప్రస్తుత గద్వాల డీఎస్పీ మొగిలయ్య, శాంతినగర్ సీఐ శంకర్, రాజోలి ఎస్సై గోకారి, అదనపు పీపీ కె. విజయ్ కుమార్, భరోసా కేంద్రం బృందం, కోర్టు డ్యూటీ అధికారులు జిక్కి బాబు, సాయిబాబా, రామచంద్రుడులను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అభినందించారు.

Next Story