- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోపిడీ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష : ఎస్పీ జానకి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ జానకి తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. 2024 డిసెంబర్ 7 న నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామ పరిధిలో నిందితుడు పుంటికూర కరుణాకర్ రెడ్డి, నవాబుపేట మండలానికి చెందిన బాధితురాలిని ఉద్దండాపూర్ గ్రామంలో వదిలేస్తానని చెప్పి తన మోటార్ సైకిల్ పై ఎక్కించుకుని కాకర్లపహాడ్ గ్రామ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి, బీర్ బాటిల్ తో తలపై మోది గాయపరిచి ఆమె మెడలో ఉన్న 4 గ్రాముల నల్లపూసల దండ, 20 తులాల వెండి కాళ్ల గొలుసులు దోచుకొని పరారయ్యాడని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న నవాబుపేట పోలీసులు, సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి మొహ్మద్ మునవర్ హుస్సేన్ నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసు విచారణలో పని చేసిన న్యాయశాఖ అధికారులు, పోలీస్ అధికారులను ఎస్పీ జానకి అభినందించారు.






