అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

by velandi.Saikiran |

అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించింది మహిళా న్యాయస్థానం.

అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: హన్వాడ పోలీస్ స్టేషన్‌ లో నమోదైన ఒక అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించింది మహిళా న్యాయస్థానం. ఈ మేర‌కు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే బాధితురాలు టైలరింగ్ నేర్చుకునే క్రమంలో నిందితుడు అతినమోని వెంకటయ్యతో పరిచయం ఏర్పడిందని...ఆ త‌ర్వాత‌ శారీరక సంబంధం దాకా వెళ్లింద‌ని ఎస్పీ తెలిపారు. అనంతరం పెళ్ళికి నిరాకరించడమే కాకుండా, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బెదిరింపులకు పాల్పడగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు హన్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కేసు విచారణ అనంతరం మహిళా న్యాయస్థానం, 4 వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి మోహద్ అఫ్రోజ్ అఖ్తర్ నిందితుడికి 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు .ఈ కేసు దర్యాప్తులో మహబూబ్ నగర్ రూరల్ సీఐ డి.స్వామి గౌడ్, హన్వాడ ఎస్ఐ రవి, ప్రస్తుత ఎస్ఐ వెంకటేష్ కీలక పాత్ర పోషించారని, అదనపు పీపీ బాలస్వామి, కోర్టు లైజన్ అధికారి, హెడ్ కానిస్టేబుల్స్ విజయ్ కుమార్, రమేష్, రఘు, తదితర అధికారులు, సిబ్బంది ని ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు.

Next Story