యువతి పై అత్యాచారం.. మృతి కేసులో నిందితుడి అరెస్టు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మూసాపేట : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో అత్యాచారానికి గురై.. వైవతి మృతి చెంది

యువతి పై అత్యాచారం.. మృతి కేసులో నిందితుడి అరెస్టు
X

దిశ, మూసాపేట : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో అత్యాచారానికి గురై.. వైవతి మృతి చెందిన ఘటనకు సంబంధించి కేసును చేయించడం జరిగిందని ఎస్పీ జానకి తెలిపారు. శుక్రవారం మూసాపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్పీ మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెల్లడించారు. వేముల గ్రామానికి చెందిన యువతి(22)కి, నిండితుడు సంగు విష్ణు ( 20 ) తో రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వీరిద్ద‌రూ తరచు ఫోన్ లో మాట్లాడుకునేవారు అని ఈ క్రమంలో ఈనెల 17న నిందితుడు విష్ణు రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతురాలకు ఫోన్ చేసి రైతు వేదిక వద్దకు రమ్మని పిలిచాడు. ఆమె అక్కడికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న యువతీ పై విష్ణు అత్యాచారానికి పాల్పడగా.. అస్వస్థతకు గురై అపస్మారస్థితికి చేరిందని తెలిపారు. నిండితుడు విష్ణు మృతురాలి బంధువు భారతికి తప్పుడు మాటలు చెప్పి సంఘటన స్థలానికి తీసుకెళ్లాడని ఎస్పీ తెలిపారు. ఇద్దరు కలిసి రైతు వేదిక పక్కన ఉన్న అంగన్ వాడి కేంద్రం వద్ద పడుకోబెట్టినట్లు చెప్పారు. తదుపరి నిందితుడు , మృతురాలు బంధువులు అరుణ్, అజయ్ సహకారంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉంది వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాల‌ని చెప్పడంతో.. వారు జానంపేట ఆసుపత్రికి తీసుకువెళ్లగా బాధితురాలు అప్పటికే మృతి చెందినట్లుగా 108 సిబ్బంది గుర్తించడం జరిగిందని ఎస్పీ వివరించారు. 18న మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు విష్ణును అరెస్టు చేసిన‌ట్టు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్ట‌ర్ బాల్ రాజ్, మూసాపేట ఎస్సై వేణు పాల్గొన్నారు.

Next Story