- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాద రహిత ప్రయాణమే మా ప్రధాన లక్ష్యం
ప్రమాద రహిత ప్రయాణమే మా ప్రధాన లక్ష్యమనే ధ్యేయంతో, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ప్రమాద రహిత ప్రయాణమే మా ప్రధాన లక్ష్యమనే ధ్యేయంతో, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి సూచనలతో కూడిన ఆదేశాల మేరకు పట్టణంలో గత వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీల్లో, సీట్ బెల్ట్ ధరించకుండా నడుపుతున్న 44 వాహనాలపై 8,800 రూపాయలు, మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న 11 కేసుల్లో 5,500, డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న 29 కేసుల్లో 75 వేలు, మొబైల్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తున్న 61 కేసుల్లో 61 వేల రూపాయల జరిమానాలు విధించామని, అలాగే సైలెన్సర్లను మార్చి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడిన 9 కేసుల్లో 11 వేల రూపాయలు, 130 ట్రిపుల్ రైడింగ్ కేసుల్లో 1,56,000 లు, హెల్మెట్ ధరించకుండా నడుపుతున్న 185 వాహనాల కేసుల్లో 31,700 రూపాయలు, 50 రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసుల్లో 60 వేల రూపాయల జరిమానాలు విధించామని, అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలపై 6 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా రోడ్డు భద్రత పై అవగాహన కల్పించామని సీఐ తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ను, 4 చక్రాల వాహనదారుడు సీట్ బెల్ట్ లను తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి కానీ, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర డ్రైవింగ్ చేయరాదని ఆయన సూచించారు. మీ భద్రత కోసం, మీ కుటుంబ క్షేమం కోసమే ఇలాంటి కఠిన నిబంధనలతో కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షింతంగా ప్రయాణించాలని సీఐ రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు.






