- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
దిశ, వనపర్తి : వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్ నగర్ జోన్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సుమారు మధ్యాహ్నం

దిశ, వనపర్తి : వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్ నగర్ జోన్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సుమారు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో దాదాపు 15 మంది ఏసీబీ అధికారుల బృందం వనపర్తి సబ్ రిజిస్టార్ కార్యాలయంలోకి ప్రవేశించింది. అకస్మికంగా దాడులు నిర్వహించిన ఏసీబీ బృందం సబ్ రిజిస్టర్,కార్యాలయం సిబ్బందిని డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం ఏవైనా అవినీతి పాల్పడినట్లు రుజువు అయితే పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేందుకు ఏ అధికారి అయినా, సిబ్బంది అయినా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ బాలకృష్ణ సూచించారు. ఫిర్యాదుదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.






