- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయండి
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలలో భాగంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకొని వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి జీరో పన్నును చేసి మన రైతాంగాన్ని తీవ్రంగా నష్ట పరుస్తున్నారు.

దిశ, అయిజ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలలో భాగంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకొని వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి జీరో పన్నును చేసి మన రైతాంగాన్ని తీవ్రంగా నష్ట పరుస్తున్నారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలైన 2025 విద్యుత్ సవరణ బిల్లును, విత్తన బిల్లును, విబి జీ రాంజీ బిల్లును రద్దు చేయాలని తెలిపారు. 29 కార్మిక చట్టాలను తీసివేసి నాలుగు కోడ్ లుగా మార్చి కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించి, యధావిధి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అయిజ మండలంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అయిజ పట్టణ కేంద్రంలో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి గోపాల్, టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకర ప్రభాకర్, సీఎల్పీ విజయభాస్కర్, రైతులు జి ఉమామహేశ్వర్, ఆర్ మైనర్ బాబు, శివప్రసాద్, భాస్కర్, చిన్న బుజ్జి పాల్గొన్నారు.






