జోగులాంబ సన్నిధిలో రష్యా యువతి

by Nallavelli.Anjaneyulu |

శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది.

జోగులాంబ సన్నిధిలో రష్యా యువతి
X

దిశ‌, అలంపూర్ : శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. అమ్మవారి నిజరూప దర్శనం కోసం రష్యా దేశానికి చెందిన ఒక మహిళా భక్తురాలు ఆలయానికి విచ్చేశారు. కేవలం దర్శనం కోసమే కాకుండా, మన సంస్కృతిపై ఉన్న మక్కువతో ఆమె పూర్తి భారతీయ సంప్రదాయ దుస్తులలో చీర కట్టుకుని, తలపై బోనం తరహాలో కలశం పెట్టుకుని కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

భారతదేశం పై మక్కువ : ర‌ష్యా యువ‌తి

​ "నాకు ఇక్కడి సంప్రదాయాలు, కట్టుబాట్లు అందమైన ప్రదేశాలు అంటే చాలా ఇష్టం" అని ఆమె తెలిపారు. ముఖ్యంగా భారతీయుల ఆప్యాయతను కొనియాడుతూ.. "ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే నాకు భారతదేశం అంటే ఎంతో ఇష్టం" అని తన మనసులోని మాటను పంచుకున్నారు. ​స్థానిక భక్తులు, పర్యాటకులు ఆ విదేశీ వనితను ఆసక్తిగా గమనిస్తూ, మన సంస్కృతిని ఆమె గౌరవించిన తీరును అభినందించారు.

Next Story