- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవి పంది ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : అడవి పంది ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన గండీడ్ మండల పరిధిలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోస్గీ నుంచి పని ముగించుకుని

X
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : అడవి పంది ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన గండీడ్ మండల పరిధిలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోస్గీ నుంచి పని ముగించుకుని గార్లపాడు వస్తుండగా వెంకటేష్ (25) అనే యువకుడి ద్విచక్ర వాహనాన్ని అంతర్గంగా రోడ్డుదగ్గర అడవి పంది అకస్మాత్తుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతని కుడి కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది ఈఎంటి జానమ్మ, పైలట్ అక్బర్ సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లోనే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవి జంతువుల సంచారం పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






