గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి గాయాలు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-23 16:03:55  IST  )

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని యువ‌కుడికి గాయాల‌య్యాయి.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి గాయాలు
X

దిశ, పెబ్బేరు : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని యువ‌కుడికి గాయాల‌య్యాయి. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాత‌ప‌ల్లి గ్రామంలో గుర్తు తెలియ‌ని బైకు ఢీ కొట్ట‌డంతో బి.కిషోర్ (25) ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. పొలం వ‌ద్ద‌కు వెళ్లి తిరిగి ఇంటికి వ‌స్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వాహ‌నం అత‌ను ప్ర‌యాణిస్తున్న బైకును ఢీ కొట్ట‌డంతో కిషోర్ గాయ‌ప‌డ్డాడు. బంధువులు వెంట‌నే స్పందించి అత‌న్ని చికిత్స నిమిత్తం వ‌న‌ప‌ర్తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story