రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, కోడేరు/కొల్లాపూర్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కోడేరు మండలం లో చోటు చేసుకుంది. కోడేరు ఎస్సై డి. జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, కోడేరు/కొల్లాపూర్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కోడేరు మండలం లో చోటు చేసుకుంది. కోడేరు ఎస్సై డి. జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన బోయ పుట్ట కురుమూర్తి (23) సోమవారం రాత్రి మాచుపల్లి నుంచి రాజాపూర్ గ్రామానికి వెళ్తుండ‌గా సింగాయిపల్లి రైస్ మిల్ దగ్గర కుక్క అడ్డుగా బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కృతిక హాస్పిటల్ కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారని ఎస్సై తెలిపారు. తండ్రి పుట్ట సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story