- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం..
by Taduka Kalyani |
బొలెరో వాహనం బైకుపై వెళ్తున్న ఓ యువకుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన జడ్చర్ల మండల పరిధి పోలేపల్లి సెజ్ క్రాస్ రోడ్డు వద్ద జరిగింది.

X
దిశ, జడ్చర్ల: బొలెరో వాహనం బైకుపై వెళ్తున్న ఓ యువకుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన జడ్చర్ల మండల పరిధి పోలేపల్లి సెజ్ క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దీపక్ గౌడ్ (22 ), పోలేపల్లి సెజ్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
దీపక్ గౌడ్ పల్సర్ బైక్ పై ప్రయాణిస్తుండగా సెజ్ క్రాస్ రోడ్డులో అతివేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో పల్సర్ బైకు నడుపుతున్న దీపక్ గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా అతని వెంట ఉన్న ప్రశాంత్ కు తీవ్ర గాయాలైనాయి. మృతుడి తండ్రి నర్సింహులు గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






