- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవరగుట్ట పరిసరాలలో పెద్దపులి సంచారం
దిశ, నవాబుపేట : మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామ సమీపంలోగల దేవర గుట్ట పరిసరాల్లో గల కోపిరాల గుండ్ల వద్ద బుధవారం సాయంత్రం ఓ రైతుకు పెద్దపులి కనిపించి కలకలం సృష్టించింది.

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామ సమీపంలోగల దేవర గుట్ట పరిసరాల్లో గల కోపిరాల గుండ్ల వద్ద బుధవారం సాయంత్రం ఓ రైతుకు పెద్దపులి కనిపించి కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన చెలిమే అంజన్న తన పశువులను మేపుతూ అటుగా వెళ్ళగా పశువులకు కాపలాగా ఉన్న కుక్కలు కోపిరాల గుండ్ల వద్ద గల చెక్ డ్యామ్ వైపు తిరిగి అదే పనిగా మొరుగుతుండడంతో అటువైపు వెళ్లి చూసిన అంజన్నకు పెద్దపులి అక్కడ సంచరిస్తూ తారసపడింది. దానిని చూసి భయంతో భీతిల్లిన అంజన్న అక్కడి నుండి తన పశువులను శరవేగంగా తోలుకొని వచ్చి గ్రామస్తులకు విషయం తెలిపాడు. కొంతకాలం క్రితం దేవర గుట్టలో చిరుత సంచారంతో భయభ్రాంతులకు గురై ఇప్పుడిప్పుడే ఆ భయం నుండి కోలుకుంటున్న గ్రామ ప్రజలకు పెద్దపులి సంచారం మరోసారి కంటిమీద కునుకులేకుండా చేసే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో దేవరగుట్టపై ఆవాసం ఏర్పాటు చేసుకుని గుట్ట పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో సంచరించి అనేక పశువులను సంహరించి చిరుత ఆ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలు గల రైతులకు తీవ్ర నష్టం వాటిల్ల చేసిన చిరుత అటవీ శాఖ అధికారులు వల పన్ని పట్టుకోజూసిన అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోయింది.
అటవీశాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలనలు జరిపి పెద్దపులిని పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని యన్మన్ గండ్ల గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గిరిజన తండాల ప్రజలు రైతులు కోరుతున్నారు. అయితే అంజన్నకు పెద్దపులి కనిపించింది అనేది నమ్మశక్యంగా లేదని మండల ప్రజలు అంటున్నారు. ఆయన చూసింది నూటికి నూరుపాళ్ళు చిరుత పులి కావచ్చని అదురుపాటులో ఆయన దానిని పెద్దపులిగా భావించి ఉంటాడని పేర్కొంటున్నారు. పెద్ద పులులు కేవలం పెద్ద అడవుల్లో మాత్రమే సంచరిస్తుండడం, ఇటువైపు ఎన్నడూ కూడా వాటి సంచారం లేకపోవడం మండల ప్రజల అనుమానాలకు కారణంగా భావించవచ్చు.






