- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం..
by Taduka Kalyani |
పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, నవాబుపేట: పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి లింగన్నపల్లి గ్రామానికి చెందిన సంపంగి నందకుమార్ (7) రోజు మాదిరిగానే బుధవారం ఒక పూట బడి ఉండటంవల్ల ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా నందకుమార్ ఆచూకీ లభించలేదు. నందకుమార్ నాయనమ్మ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






